![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -273 లో.....రామలక్ష్మి శ్రీలతని పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. ఇప్పుడు శంకర్, లాయర్ ని తీసుకొని వచ్చి నిజం చెప్పించడం అనేది నిమిషంలో జరుగుతుంది కానీ అలా చెయ్యాలనుకోవడం లేదు.. మీలో మార్పు రావాలి. ఇప్పుడు డబ్బు కావాలా? అమ్మ కావాలా అంటే సందీప్ చూసారా ఎలా అన్నాడు.. డబ్బు కావాలన్నాడు కానీ సీతా సర్ మీ క్షేమం కోసం ఎలా చేస్తున్నాడు చూడండి. మీరు అనుకుంటున్న ఆస్తి సందీప్ కి వస్తే జల్సాలు చేస్తూ పాడు చేస్తాడు.
అదే సీతా సర్ దగ్గరుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఏ నిర్ణయం అయినా మీరే తీసుకోండి అని రామలక్ష్మి అనగానే శ్రీలత ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన తల్లి బాగుండాలని అర్చన చేయమంటాడు. అక్కడ అత్తయ్య ఉంది తీసుకొని వస్తానని రామలక్ష్మి వెళ్తుంది. ఏం నిర్ణయం తీసుకున్నారని రామలక్ష్మి అనగానే.. నేను తప్పు చేసానని పశ్చతాపడుతుంది శ్రీలత. ఆ తర్వాత శ్రీలతని రామలక్ష్మి తీసుకొని వస్తుంది. ఇక విడాకులకి వారం రోజులు గడువు అడిగాను కదా ఇవ్వాలిటితో గడువు అయింది. కానీ నాకు విడాకులు ఇవ్వాలని లేదని సీతాకాంత్ అనగానే నాక్కూడా అని రామలక్ష్మి అంటుంది. ఇక శ్రీలత, రామలక్ష్మి లు సరదాగా మాట్లాడుకుంటుంటే.. సీతాకాంత్ చూసి మీరు కలిసి పోయారా అని అడుగుతాడు. అత్త కోడళ్ళ మధ్య సవాలక్ష ఉంటాయని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ఆస్తుల పేపర్స్ సీతాకాంత్ కి ఇస్తుంది. సీతకాంత్ శ్రీలతకి ఇస్తుంటే తను వద్దని అంటుంది. అదేంటీ అత్తయ్య అంత ప్రేమగా ఇస్తుంటే వద్దని అంటున్నారని శ్రీవల్లి అనగానే.. శ్రీలత కోపంగా తన వైపు చూస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకొని సందీప్ పక్కకి వచ్చి అమ్మని ఫేస్ చెయ్యలేను.. ఇందాక డబ్బు కావాలా? అమ్మ కావాలా అంటే డబ్బే కావాలన్నం కదా అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఆస్తి పేపర్స్ తీసుకోకపోతే నా మీద ఒట్టే అని సీతాకాంత్ అనగానే.. శ్రీలత తీసుకుంటుండగా ఆ పేపర్స్ మంటల్లో పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |